గోరింట పూసింది...
close
Published : 24/07/2021 01:26 IST

గోరింట పూసింది...

ఆషాఢంలో అమ్మాయిలంతా గోరింటాకు పెట్టుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇందుకు కారణాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలానే చెబుతారు. ఏది ఏమైనా అరచేయి ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.

ఆకుని... చిన్న పటిక ముక్క లేదా రెండు లవంగాలు వేసి రుబ్బండి. ఆపై ఆ ముద్దకు రెండు చుక్కల యూకలిప్టస్‌ నూనె కలిపి ఓ పావుగంట పక్కన పెట్టి తర్వాత చేతికి పెట్టుకోండి. ఎర్రటి రంగు ఖాయం.

* మెహెందీ తీసేశాక పెనంపై ఇంగువ/ లవంగాలను వేసి వేడి చేయండి. ఆ పొగ చేతులకు తగలనిస్తే కాసేపటికి మంచి రంగు వస్తుంది.

* గోరింటాకు పెట్టుకున్నాక... అది ఆరిపోతుంటే చక్కెర, నిమ్మరసం కలిపిన నీళ్లను అద్దుతూ ఉండండి.

* గోరింటాకు తీసేశాక ఆవ/కొబ్బరి నూనెను రాసుకుంటే ఎర్రగా పండుతుంది. పెట్రోలియం జెల్లీ కూడా రాయొచ్చు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని