నకాషీకి నగిషీలద్ది!
close
Updated : 20/03/2021 06:23 IST

నకాషీకి నగిషీలద్ది!

నాలుగొందల సంవత్సరాల నాటి అపురూపమైన నకాషీ చిత్రకళ అది... గతంలో ఎంతో మంది కళాకారుల కడుపునింపిన ఆ కళ... కొన్నేళ్ల క్రితం దాదాపుగా అంతరించిపోయే దశకు చేరుకుంది.  తమ పట్టుదల, ఆసక్తులతో నేడు ఆ కళకు జీవం పోస్తున్నారు చేర్యాల మహిళలు... తాము రూపొందించిన నకాషీ మాస్క్‌లు, చిత్రాలకి దేశవ్యాప్తంగా ఆదరణ కల్పిస్తున్నారు...
నకాషీ చిత్రకళ అంత తేలికైన విద్యేం కాదు. ఈ కళని అభ్యసించాలంటే ఎంతో ఓపిక, సహనం ఉండాలి. అందుకేనేమో కొన్నేళ్ల క్రితం వరకూ ఈ కళ తెలిసిన వాళ్లు నలుగురికి మించి ఉండేవాళ్లు కాదు. చేర్యాల మహిళలు ముందుకు వచ్చి పట్టుదలతో ఈ నైపుణ్యాన్ని ఒంటపట్టించుకున్నారు. నకాషీ చిత్రాలకు ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకురావడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. వారి పట్టుదలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా తోడయ్యింది. హ్యాండీ క్రాఫ్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి వారికి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. ప్రభుత్వానికి ఈ ఆలోచన రాకముందే చేర్యాలకు చెందిన ధనాలకోట వెంకట్రామయ్య కుటుంబీకులతో సహా పలువురు ఆసక్తి ఉన్నవారికి ఈ కళని నేర్పించేవారు. క్రమంగా నేర్చుకునేవారి సంఖ్య, మహిళల్లో ఆసక్తి పెరగడం గమనించిన ప్రభుత్వం శిక్షణకోసం ప్రత్యేకంగా చేర్యాలలో 2018లో ఓ భవనం నిర్మించింది. కళను ప్రోత్సహించేందుకు శిక్షకులకు జీతం, నేర్చుకునే మహిళలకు స్టైఫండ్‌ను కూడా అందిస్తున్నారు. గతంలో ఇంటిపనులకే పరిమితమైన మహిళలంతా నేడు నకాషీ కళను నేర్చుకుంటూ ఆదాయమూ పొందుతున్నారు.

నకాషీ చిత్రాల్లో హిందూ పురాణాలు ప్రధానాంశంగా ఉంటాయి. రామాయణ, మహా భారతాలతోపాటూ మార్కండేయ, గరుడ, జాంబవంత, శివపురాణాల్లోని సన్నివేశాల్ని అందంగా చిత్రీకరించాలి. మాస్కులు, చిత్రాలకోసం వాడే రంగుల్లో రసాయనాలు ఉండవు. వీటిని సహజంగా తయారుచేయాలి. ఇందుకోసం ఎర్ర బంతి పూలు, పసుపు కొమ్ములు, పాలకూర, బచ్చలికూర వంటివి ఉపయోగించి ఈ రంగుల్ని తయారు చేసుకోవాలి. అడవుల్లో దొరికే రంగురాళ్లని తెచ్చి దంచి రంగుల్ని తయారుచేయాలి. ఈ పనులన్నీ మహిళలే స్వయంగా చేసుకుంటూ చక్కని బొమ్మల్ని రూపొందిస్తున్నారు. అలా చేసిన వాటిని హస్తకళా ప్రదర్శనల్లోనూ ఉంచుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు సాగిస్తున్నారు. నకాషీ చిత్రకారిణి నాగిళ్ల వనజ 2018లో దిల్లీలో జరిగిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో చేర్యాల బొమ్మలను ప్రదర్శించి అందరి మన్ననలూ అందుకుంది.

- తుపాకుల సాయిచరణ్‌, సిద్దిపేట

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి