మయన్మార్‌ మహిళల అస్త్రం... ఆ వస్త్రం...
close
Published : 23/03/2021 01:11 IST

మయన్మార్‌ మహిళల అస్త్రం... ఆ వస్త్రం...

వస్త్రానికి ఆ దేశంలో వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మహిళలు నడుము భాగంలో ధరించే దీన్ని అక్కడి వారాంతా పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు దాన్నే అక్కడి మహిళలు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో అస్త్రంగా మార్చుకున్నారు. అదే ‘లాంగీ(సరోంగ్‌)’. ఆ దేశమే మయన్మార్‌. సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ధిన్‌జార్‌ ఘన్‌లీ అనే మహిళ పోస్ట్‌ చేసిన ఒక ఫొటో వైరల్‌ అవడమే కాదు, అందరికీ సరోంగ్‌ను పరిచయం చేసింది. మయన్మార్‌లో సైనికుల కంటే ‘సరోంగ్‌ వస్త్రమే’ తనకెక్కువ రక్షణ కల్పించింది...అంటూ ఓ ఫొటోను ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేశారీమె. ప్రస్తుతం ఆ దేశ రహదారుల్లో ఎక్కడ చూసినా ఈ వస్త్రాల తోరణాలే కనిపిస్తున్నాయి. సైనికులు తమపై కాల్పులు జరపకుండా ఉండటానికి మహిళా ఉద్యమకారులు వీటినిలా వేలాడదీస్తున్నారు. వారు ప్రయాణించే మార్గాల్లో నేలపై పరుస్తున్నారు. గతంలో శత్రువుపై పోరాడటానికి యుద్ధభూమికి వెళ్లే యోధులు తమ తల్లి ధరించే సరోంగ్‌ నుంచి చిన్న ముక్కను వెంట తీసుకెళ్లేవారని చరిత్ర చెబుతోంది. అంతేకాదు, 1988లో జరిగిన తిరుగుబాటులో కూడా అక్కడి నిరసనకారులు తమ తల్లుల సరోంగ్‌ను తలపాగాల్లా కట్టుకుని మరీ పోరాడిన సంఘటనలు చరిత్రలో నిలిచాయి. అంతటి ప్రత్యేకత ఉన్న ఈ వస్త్రం ఇప్పటి ప్రజాస్వామిక ఉద్యమంలో ప్రధానం కావడం విశేషం.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి