ఓడిపోవడం తప్పు కాదు...
close
Published : 26/03/2021 00:27 IST

ఓడిపోవడం తప్పు కాదు...

జీవితంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ ఓటమిని చవిచూస్తూనే ఉంటారు. సున్నిత మనస్కులైన అమ్మాయిలు దాన్ని పదేపదే తలుచుకుని మరింత కుంగిపోతారు. నిజానికి ఓడిపోవడం తప్పుకాదు. తిరిగి ప్రయత్నించక పోవడమే అసలైన తప్పు.

పరీక్ష, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబ బాధ్యతలు... ఇలా దేంట్లోనైనా విఫలం కావచ్చు. ఓడిపోయామనే అపరాధ భావంతో కొంతమంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. తీవ్రమైన నిరాశతో కుంగుబాటుకు గురవుతుంటారు.
కారణాలను అన్వేషించాలి: విఫలమైన తర్వాత ‘ఇక నేనెందుకూ పనికిరాను’ అనే ఆలోచనకు వెంటనే వచ్చేయకూడదు. దాని వెనక ఉండే కారణాలనూ లోతుగా విశ్లేషించుకోవాలి. మళ్లీ అలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ గురించి మీకంటే బాగా ఎవరికీ తెలియదు. కాబట్టి జరిగిన దాంట్లో మీ పొరపాట్లను గుర్తించి... అలాంటివి మళ్లీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది.
చెడు అలవాట్లు: ఓడిపోయామనే భావన వెంటాడుతుంటే దాన్నుంచి తప్పించుకోవడానికి... కొంతమంది చెడు అలవాట్లకు చేరువవుతుంటారు. అతిగా నిద్రపోవడం, మితిమీరి తినడం, ఏ పనీ చేయకపోవడం, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటం... లాంటివి చేస్తుంటారు. ఇలాచేయడం వల్ల మరింత కుంగిపోయే అవకాశముంటుంది.
ప్రేరణ పొందాలి: మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఒక అవగాహనకు రావడానికీ ఓటమి నుంచే ప్రేరణ పొందాలి. నిజానికి ఆపదలో ఉన్నప్పుడే అసలైన ఆప్తులెవరో మీకు అర్థమవుతుంది. ఆ సమయంలో మీకు చేయూతను అందించేవాళ్లు చెప్పే మాటలను మనసుపెట్టి ఆలకించండి. ఓటమి నేర్పిన పాఠాలతో జీవితాన్ని మరింత అందంగా మలచుకోవచ్చు. ఆ దిశగా అడుగులు వేయడానికి మెల్లగా ప్రయత్నాలు మొదలుపెట్టండి.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి