పిల్లలు ఇష్టంగా పాలు తాగడం లేదా? - how to give tasty milk to your child in telugu
close
Published : 28/06/2021 16:57 IST

పిల్లలు ఇష్టంగా పాలు తాగడం లేదా?

పిల్లలకు పాలు బలవర్థకమైన ఆహారం అన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పుట్టగానే వారికి మొట్టమొదట అందే ఆహారం కూడా అదే. అయితే పిల్లలు పసితనంలో తాగే తల్లిపాల ద్వారా వారి ఎదుగుదలకు కావాల్సిన పోషకాలన్నీ అందడంతో పాటు అవి వారికి ఎంతో రుచిగానూ ఉంటాయి. కానీ పెరిగే క్రమంలో ఇచ్చే సాధారణ పాలు అంతగా రుచించక చాలామంది పిల్లలు పాలు తాగడానికి వెనుకాడుతూ.. తల్లిని పదే పదే సతాయిస్తుంటారు. ఫలితంగా పాల ద్వారా వారి శరీర ఎదుగుదలకు అందాల్సిన పోషకాలు అందకుండాపోతాయి. అలాగని వారిని పట్టించుకోకుండా వదిలేయలేం. కాబట్టి రోజూ పిల్లలు తాగే పాలు మరింత రుచికరంగా తయారు చేయాలి. అప్పుడే వారు మరింత ఇష్టంతో పాలు తాగుతారు. మరి, ‘ప్రపంచ పాల దినోత్సవం’ సందర్భంగా పిల్లలకు రుచికరమైన పాలు అందించడమెలాగో తెలుసుకుందాం.. రండి.

తయారు చేయండిలా!

పిల్లల ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేసే పాలు వారు ఇష్టంగా తాగాలంటే.. రకరకాల పండ్లతో స్మూతీలు, మిల్క్‌షేక్స్‌గా తయారు చేసి వారికి అందించాలి. అయితే వీటి తయారీలో పండ్ల పరిమాణం కాస్త తక్కువగా, పాల పరిమాణం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా ఎక్కువ మొత్తంలో పాలు వారికి అందించవచ్చు. అలాగే 'ఎక్కువ తియ్యగా ఉంటే త్వరగా తాగుతారు కదా..' అని చక్కెర మరీ అధికంగా వేయకూడదు. ఎందుకంటే మొదట వారికి ఎక్కువ తీపితో అందించి.. తర్వాత క్రమంగా తీపి తగ్గిస్తే వారు ఇవి కూడా తాగకపోవచ్చు. అలాగే అధిక చక్కెర వినియోగించడం వల్ల ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది.

బలవర్థకమైనవే..

చాలామంది పిల్లలు కేవలం పాలు మాత్రమే ఇస్తే తాగరు. అందులో బాదం, పిస్తా, కుంకుమపువ్వు, చాక్లెట్.. వంటి ఫ్లేవర్లతో కూడిన శక్తిమంతమైన, రుచికరమైన పదార్థాల్ని కలిపితే గానీ వాటి మొహం కూడా చూడరు. అయితే కొంతమంది తల్లులు మాత్రం వీటిని పాలలో కలపడం వల్ల పాల నాణ్యత దెబ్బతింటుందని భావిస్తారు. కానీ రుచికోసం పిల్లల పాలలో కలపడానికి ప్రత్యేకంగా తయారు చేసిన కొన్ని ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించవచ్చు. అలాగే పోషకాహార నిపుణుల సలహా తీసుకుని కూడా రుచి కోసం పాలలో కలిపే పదార్థాల్ని ఎంచుకోవచ్చు. ఫలితంగా పిల్లలకు అందించే పాలు రుచిగా మారడంతో పాటు పాలలో ఉండే క్యాల్షియం, విటమిన్ డి.. వంటి పోషకాలు పిల్లలకు సమృద్ధిగా అందుతాయి.

వెన్నతో పాటే..

వెన్నతో కూడిన పాలు చాలా రుచిగా ఉంటాయి. అయితే కొంతమంది తల్లులు పిల్లలకు వీటిని నేరుగా ఇస్తే.. అందులోని కొవ్వులు శరీరంలోకి చేరి.. లేనిపోని సమస్యలకు దారితీస్తాయన్న సందేహంతో వెన్న తొలగించి అందిస్తారు. కానీ ఇలాంటి పాలు పిల్లలకు అస్సలు రుచించవు. అందుకే పాలు ఇవ్వడం ప్రారంభించినప్పుడు వెన్నతోనే ఇస్తూ.. క్రమంగా అందులోని వెన్న శాతాన్ని తగ్గిస్తే మంచిది. ఫలితంగా వారికి పాలు రుచించడంతో పాటు కొన్ని రోజుల తర్వాత వెన్న తొలగించిన పాలను తాగడానికి కూడా పిల్లలు అలవాటుపడే అవకాశం ఉంటుంది.

ఇవి కలపొచ్చు..

పిల్లలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా తినడానికి ఇష్టపడే కార్న్‌ఫ్లేక్స్, చాకోస్.. వంటివి నేరుగా అందించకుండా.. పాలలో కలిపి ఇవ్వడం శ్రేయస్కరం. దీంతో వాటిలోని రుచి పాలలోకి చేరి.. పాలు మరింత రుచిగా మారతాయి. ఫలితంగా వారు ఆ పదార్థాల్ని తిని, అలాగే పాలు కూడా తాగుతారు. ఇలా మీరు అందించే ఆహారంతో అటు పాలు తాగడం, ఇటు బ్రేక్‌ఫాస్ట్ చేయడం.. రెండూ పూర్తవుతాయి.

పలు రకాలుగా!

స్వీట్లంటే కేవలం బయట నుంచి తెచ్చుకున్నవే కాదు.. ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఇంట్లో చేసే సేమ్యా, కలాకండ్, ఖీర్.. మొదలైన మిఠాయిల్లో పాలు అధికంగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి పిల్లలకు ఎక్కువగా ఇలాంటి తీపి పదార్థాలు చేసి అందించాలి. ఫలితంగా స్వీట్ల రూపంలోనూ పాలు వారికి అందించవచ్చు. అలాగే పిల్లలకు ఐస్‌క్రీమ్ అంటే ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్లోనే పాలతో ఐస్‌క్రీమ్ తయారు చేయవచ్చు. వీటితోపాటు పిల్లలకు ఇవ్వడానికి తయారు చేసే కేక్స్, బిస్కెట్స్, ఓట్‌మీల్, పాస్తా.. వంటి పదార్థాల్లో నీళ్లకు బదులుగా పాలను ఎక్కువగా ఉపయోగించడం కూడా మంచిదే.
పిల్లలకు బలవర్థకమైన పాలను రుచిగా ఎలా అందించాలో తెలుసుకున్నారు కదా! మరి మీరు కూడా మీ పిల్లల విషయంలో ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి. వారి సంపూర్ణ ఎదుగుదలకు సహకరించండి.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని