అందుకే విమానంలో ఒంటరిగానే 52 దేశాలు చుట్టేస్తోంది! - teenage pilot zara rutherford begins solo round world record bid
close
Published : 20/08/2021 19:23 IST

అందుకే విమానంలో ఒంటరిగానే 52 దేశాలు చుట్టేస్తోంది!

(Photo: Instagram)

పైలట్‌గా మారి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని కలలు కనే అమ్మాయిల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్నో ఆంక్షలు! మరోవైపు STEM (Science, Technology, Engineering, Mathematics) వంటి రంగాల్లో పురుషాధిపత్యమే రాజ్యమేలుతోంది. దీంతో ఇలాంటి అరుదైన రంగాల్లో రాణించాలనుకునే ఎంతోమంది యువతుల కలలు ఊహలుగానే మిగిలిపోతున్నాయి. ఇదిగో ఇలాంటి ధోరణినే మార్చాలని కంకణం కట్టుకుంది 19 ఏళ్ల జరా రూథర్‌ఫర్డ్‌. శాస్త్రసాంకేతిక రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగేందుకు.. వారిని ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రపంచ యాత్రకు బయలుదేరింది. అమ్మాయిలు ఒంటరిగానైనా ప్రపంచాన్ని చుట్టిరాగల సమర్థులు అని నిరూపించడానికే ఈ సాహసయాత్రకు పూనుకున్నానని చెబుతోంది జరా.

జరా రూథర్‌ఫర్డ్‌.. 19 ఏళ్ల ఈ బెల్జియన్‌-బ్రిటిష్‌ యువతికి వ్యోమగామి కావాలనేది చిన్ననాటి కల. తల్లిదండ్రులిద్దరూ పైలట్లు కావడంతో ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహం తోడైంది. అయితే తనొక్కర్తే ఇలా ఎదగడం కాకుండా.. STEM వంటి అరుదైన రంగాల్లో అమ్మాయిల్ని ప్రోత్సహించాలనుకుంటోందామె. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ప్రపంచమంతా చుట్టి రావాలని ప్లాన్‌ చేసుకుంది.

వారిలో ఆ ధైర్యం నింపడానికే!

ప్రస్తుతం గణితంలో ఎ- లెవెల్ (అడ్వాన్స్‌డ్ లెవెల్) పూర్తి చేసిన జరా.. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదవాలని తన తదుపరి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే శాస్త్రసాంకేతిక రంగాల్లో అమ్మాయిలకు ప్రోత్సాహం కరువవుతోందని.. ఈ మూసధోరణిని అమ్మాయిలంతా బద్దలుకొట్టాలని కోరుకుంటోంది.

‘ఎప్పటికైనా వ్యోమగామి కావాలనేది నా కల. అమ్మానాన్నలిద్దరూ పైలట్లు కావడంతో.. వాళ్లను చూసి లక్ష్యం దిశగా నాలో కసి మరింతగా పెరిగింది. నాలాగే ఎంతోమంది అమ్మాయిలు శాస్త్రసాంకేతిక రంగాల్లోకి అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వివక్ష, పురుషాధిపత్యం, తగిన ప్రోత్సాహం లేకపోవడం.. వంటివన్నీ వారి కలలకు అడ్డుపడుతున్నాయి. వీటన్నింటినీ బద్దలుకొట్టి అమ్మాయిలు ధైర్యంగా ముందుకు రావాలి. వాళ్లలో ఆ ధైర్యం నింపడానికే ఒంటరిగా ప్రపంచమంతా చుట్టి రావాలని నిర్ణయించుకున్నా. నన్ను చూసి ‘జరాలా నేను కూడా ఏదో ఒక రోజు నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటా’ అని ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటే నేను తీసుకున్న ఈ నిర్ణయానికి సార్థకత లభించినట్లే!’ అంటోందీ టీనేజీ అమ్మాయి.

52 దేశాలు.. 51 వేల కిలోమీటర్లు..!

గతేడాదే పైలట్‌ లైసెన్స్‌ పొందిన జరా.. తన సొంత విమానం ‘షార్క్‌ అల్ట్రా లైట్‌ ప్లేన్‌’లో ప్రపంచ యాత్రకు బయలుదేరింది. ఆగస్టు 11నే ప్రారంభం కావాల్సిన యాత్ర కొన్ని కారణాలతో వారం పాటు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈదురు గాలులు, మేఘావృతమైన ఆకాశంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆమెకు వీడ్కోలు చెప్పి సాగనంపారు. ఇక జరా ప్రయాణించే ప్లేన్‌ విషయానికొస్తే... రెండు సీట్లున్న ఈ విమానం చాలా తేలికైనది. ఒకవేళ ఇంజిన్‌ విఫలమైనా, ఇతరత్రా సాంకేతిక సమస్యలు తలెత్తినా.. విమానం ల్యాండింగ్‌ వేగం తగ్గి, త్వరగా ల్యాండయ్యే ప్రత్యేకత దీని సొంతం. ఇలాంటి లైట్ వెయిట్‌ విమానంలో సుమారు 3 నెలల పాటు 5 ఖండాలు, 52 దేశాలు, 51 వేల కిలోమీటర్లు ప్రయాణించనుందీ బెల్జియం టీన్.

‘నాకు 14 ఏళ్ల వయసున్నప్పట్నుంచే విమానం నడపడంలో శిక్షణ తీసుకుంటున్నా. గతేడాది పైలట్‌ లైసెన్స్‌ కూడా సంపాదించా. నా నిర్ణయం చెప్పినప్పుడు అమ్మానాన్న కాస్త భయపడినా.. ఆ తర్వాత నన్ను ప్రోత్సహించారు. మూడు నెలల పాటు ఈ యాత్ర సాగనుంది. బ్రెజిల్‌ రాజధాని బ్రసెల్స్‌ మీదుగా అట్లాంటిక్‌, గ్రీన్‌ల్యాండ్‌, కెనడా, దక్షిణ అమెరికా, అలస్కా, రష్యా, ఇండోనేషియా మీదుగా సాగుతూ తిరిగి యూరప్‌ చేరుకుంటా. మధ్యమధ్యలో ఆయా దేశాల్లో ఆగుతూ అక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్ని తెలుసుకుంటా. అక్కడి ప్రజలతో మమేకమవుతా.. సురక్షితంగా ఈ యాత్రను పూర్తి చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా’ అని అంటోంది జరా.

ఆ రికార్డును తిరగరాస్తుందా?!

ఇక తన సాహసయాత్ర కోసం తన పేరెంట్స్‌పై ఆధారపడకుండా స్పాన్సర్ల సహకారంతో స్వయంగా నిధులు సమీకరించుకుందీ టీనేజర్‌. తాను అనుకున్నట్లుగానే అన్నీ సవ్యంగా జరిగి ఈ సాహసయాత్రను పూర్తి చేస్తే.. ఒంటరిగా విమానంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన అతిపిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కుతుంది జరా. అంతేకాదు.. మైక్రోలైట్‌ ప్లేన్‌లో ఒంటరిగా ఈ సాహసయాత్ర చేసిన కీర్తినీ మూటగట్టుకోనుంది. ఈ క్రమంలో తన పేరు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కాలని దానికి అనుగుణంగానే తన రూట్‌ మ్యాప్‌ను సైతం రూపొందించుకుందామె.

ఇక గతంలో మహిళల్లో ఈ రికార్డు 30 ఏళ్ల అమెరికన్‌ మహిళ షాయెస్టా వెయిజ్ పేరిట ఉంది.. ఆ రికార్డును తిరగరాసేందుకు సిద్ధమవుతోంది బెల్జియం టీన్‌. ఇలా కేవలం తన యాత్రతో టీనేజీ అమ్మాయిల్లో స్ఫూర్తి నింపడమే కాదు.. వారిని స్టెమ్‌ రంగాల దిశగా ప్రోత్సహించడానికి నిధులు సైతం సమీకరిస్తోంది జరా. ఇక మరోవైపు స్నీకర్స్‌ షూ బిజినెస్‌ కూడా చేస్తోంది.

మరి, జరా లక్ష్యం నెరవేరాలని, ఆమె ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ జరా!!
మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

తరువాయి

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

తరువాయి

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని