
సిద్ధిటెక్: ఆలయానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ ఓ శునకం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా సిద్ధిటెక్ పట్టణంలో సిద్ధి వినాయక ఆలయానికి వచ్చేవారికి షేక్‌హ్యాండ్ ఇస్తూ వార్తల్లోకెక్కింది. ఈ శునకం ప్రత్యేకతపై అరుణ్ లిమాడియా అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వీధి శునకం సిద్ధివినాయక ఆలయం బయట మెట్లను ఆనుకొని ఉన్న పెద్ద గోడపై కూర్చొని ఉంది. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చే భక్తులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, ఒక చేతితో దీవించడంతో దీన్ని అంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. ఆ శునకం చేసే పనులను చూసి భక్తులు మురిసిపోతున్నారు.
ఓ వ్యక్తి ఆలయం నుంచి బయటకు వస్తుండగా ఆ శునకాన్ని చూసి నమస్కరిస్తూ తన తలను కాస్త కిందకు వంచగా.. అతడిని దీవించడం చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ శునకంపై ప్రశంసలు కురిపిస్తూ.. కామెంట్లు పెడుతున్నారు. భారీ సంఖ్యలో లైక్‌లు, షేర్లు వస్తుండటంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ క్యూట్ వీడియో మీరూ చూడండి.
మరిన్ని
దేవతార్చన
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ద్వివేది, గిరిజా శంకర్‌పై ఎస్ఈసీ చర్యలు
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే