
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పెళ్లిలో మూడు ముళ్లు, ఏడడుగులు వేస్తారు. కలకాలం కలిసి జీవించాలని పెళ్లి ప్రక్రియలో భాగంగా నవ దంపతులు అగ్ని చుట్టూ ఏడడుగులు నడుస్తారు. కానీ ఇక్కడ ఏడడుగులకు బదులుగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు స్టెప్పులు వేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కల్యాణం జరిగిన అనంతరం ఓ నూతన జంట కొంగుముడితో అగ్ని చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేశారు. పెళ్లికి వచ్చిన వారు కూడా చప్పట్లు కొడుతూ జంటను ఉత్సాహపరిచారు.
ఈ వీడియోను బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ కంపెనీ ఛైర్మన్, ఎండీ వేదాంత్ బిర్లా ట్విటర్లో పంచుకున్నారు. ‘ఈ వీడియోను చూడండి. ఇది పెళ్లేనా? మన సంప్రదాయాలకు విలువ లేకుండా పోయింది. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా మనకు గుర్తింపు మన సంస్కృతి, సంప్రదాయాలవల్లే వచ్చాయన్న విషయం మర్చిపోవద్దు’ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టమైన సమాచారం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. సంప్రదాయాలను పక్కన పెట్టి పవిత్రమైన అగ్ని చుట్టూ నృత్యం చేయడంపై నెటిజన్లు మీడియా వేదికగా విమర్శస్తున్నారు. అగ్ని చుట్టూ డ్యాన్స్ చేయడం.. అమర్యాదకరం, అసహ్యకరం అని వారు పోస్టులు చేస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
దేవతార్చన
- కార్చిచ్చులా కరోనా
- కొవిడ్-19 ఎందుకింత ఉద్ధృతం?ఎప్పుడు ప్రమాదకరం?
- మీ పేరుపై ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోండి
- నా భర్తను ముద్దు పెట్టుకుంటా..ఏం చేస్తారు..
- Horoscope: ఈ రోజు రాశి ఫలం
- చెన్నై చెడుగుడు
- ఆ డేటా ఫోన్లో ఉంటే డిలీట్ చేయండి: ఎస్బీఐ
- తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
- భారత్లో కరోనా: యూకే ఆంక్షలు
- వచ్చే 3 వారాలు కీలకం