Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
అతి సామాన్యులు... అసామాన్య పోరాటధీరులు
పేదల ఇళ్లను గుప్పిటపట్టిన పెద్దల గుట్టును రట్టు చేశారు. చౌకధరల దుకాణాలను దక్కించుకున్న అనర్హుల జాతకాలను బయటపెట్టారు. మిగులు భూములను మింగేసిన బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.ఇవన్నీ చేసింది... చేస్తోంది... ఎవరో బాగా చదువుకున్న ఉద్యమకారులు కాదు! అతి సాధారణ వ్యక్తులు...ఆటోడ్రైవర్లు.
శంకరమఠం ఆటో సంఘం, విశాఖపట్నం. 32 మంది ఆటోడ్రైవర్లు అందులో సభ్యులు. అందరి విద్యార్హతలూ పదోతరగతి నుంచి డిగ్రీ లోపే.

కానీ... సహ చట్టంపై మాత్రం వారికి పూర్తి పట్టు ఉంది. దాని సాయంతోనే అధికారులను నిలదీస్తారు. భూముల కేటాయింపుల నుంచి చౌకధరల దుకాణాల మంజూరు వరకూ ఎందులో ఏ అక్రమాలు జరిగినా వెంటనే సహ దరఖాస్తులు చేస్తారు. అలా ఇప్పటివరకూ వివిధ ప్రజా సమస్యలపై 115 దరఖాస్తులు సంధించారు.

వీరి ఆటోలన్నిటిపై సహ పోస్టర్లు ఉంటాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూనే, వారికి చట్టాన్ని పరిచయం చేస్తారు. కరపత్రాలు అందజేస్తారు. అప్పుడప్పుడూ సొంత ఖర్చులతో అవగాహన సదస్సులూ (ఇప్పటికి 5) నిర్వహిస్తారు.

విజయాల్లో కొన్ని...
గరానికి నడిబొడ్డున ఉన్న ద్వారకానగర్‌ ఆరోలైనులో కొంత స్థలాన్ని రజకుల దోబీఘాట్‌కు కేటాయించారు. అక్కడ వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల జాబితా తయారైంది. అప్పటి స్థానిక కార్పొరేటర్‌, కొందరు అధికారుల అండతో అనర్హులకీ అందులో చోటు దక్కింది. ఆ తర్వాత ఇళ్లూ సొంతమయ్యాయి. దీనిపై సంఘం సభ్యులు స్పందించారు. ఇళ్లను ఎవరెవరికి కేటాయించారు, వారి అర్హతలేంటంటూ దరఖాస్తులు చేశారు. దాంతో నగరపాలక సంస్థ విచారణ చేపట్టింది. 18 మందిని బినామీలుగా తేల్చింది. వారందరినీ ఇళ్లు ఖాళీ చేయించింది. అసలైన లబ్ధిదారులకు వాటిని కేటాయిస్తామని అధికారులు ప్రకటించారు.

పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో డిపోల ఏర్పాటుకు గతంలో ప్రకటన వెలువడింది. ఆ తర్వాత కేటాయింపుల్లో నిబంధనలను పాటించలేదు. ఈ ఉల్లంఘనలను ఆటోడ్రైవర్లే సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి తెచ్చారు.

నగరంలో 26వ నంబరు డిపోను వికలాంగులకు కేటాయించాల్సి ఉంది. కానీ, అధికారులు ఎలాంటి వైకల్యం లేని వ్యక్తికి ఇచ్చేశారు. దీనిపై సహ దరఖాస్తు చేస్తే వాస్తవం వెల్లడైంది. డీలర్‌ సస్పెండ్‌ అయ్యారు.

డిపో నంబరు 51 కోసం చాలామంది విద్యావంతులు అర్జీలు పెట్టుకున్నారు. వారిలో ఎంబీఏ పూర్తి చేసిన వారూ ఉన్నారు. చివరికి వచ్చేసరికి తక్కువ విద్యార్హత ఉన్న వ్యక్తికి డిపో దక్కింది. దీన్ని తమ సహ దరఖాస్తులతో ప్రశ్నించారు ఆటోడ్రైవర్లు. డిపో లబ్ధిదారువి తక్కువ విద్యార్హతలేనని తేలింది. తను సమర్పించిన ధ్రువపత్రాలు కూడా నకిలీవని నిర్థరణ అయింది. ఫలితంగా ఆ డీలర్‌షిప్పు రద్దు అయింది. అర్హులకు అందింది.

ప్రభుత్వ మిగులు భూములు ఎక్కడెక్కడ, ఎవరి ఆధీనంలో ఉన్నాయంటూ కూడా దరఖాస్తులు చేశారు. దాంతో యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కొన్ని స్థలాలు పెద్దల ఆధీనంలో ఉండటంతో సమాచారం ఇవ్వడానికి కిందామీదాపడుతోంది.

- అల్లం నాగేశ్వరరావు,
న్యూస్‌టుడే, విశాఖపట్నం
ముందడుగే స్ఫూర్తి
కార్మికులందరూ ‘ఈనాడు ముందడుగు’ పేజీలను చదువుతూనే చట్టాన్ని తెలుసుకున్నారు. పేజీలో ప్రచురితమయ్యే సహ విజయాలను స్ఫూర్తిగా తీసుకునే దరఖాస్తులు చేస్తున్నారు. జిల్లాపత్రికల్లో వచ్చే అవినీతి కథలపై సమాచారం అడుగుతున్నారు. అంతేకాదు... సాటి ఆటోడ్రైవర్లకూ చట్టంపై అవగాహన కల్పిస్తున్నారు. వారి ఆటోలపై కూడా పోస్టర్లను అతికిస్తున్నారు. చట్టం ప్రత్యేకత, దరఖాస్తు చేసే పద్ధతి, సమాచారం రాకపోతే ఎలా ముందుకెళ్లాలన్న విషయాలను వాటిలో వివరిస్తున్నారు. సంఘం నాయకుడు గుత్తల త్రిమూర్తి నేతృత్వంలో చిలిమి రామిరెడ్డి, వై.నరసింగరావు, ఎ.నాగరాజు, వై.చంటి, సీహెచ్‌.మాణిక్యం తదితరులు సహోద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఈనాడు ముందడుగుతోనే మాకు చట్టంపై అవగాహన పెరిగింది. పత్రికలో వచ్చిన విజయాలను చదివే దరఖాస్తులు చేయడం ప్రారంభించాం. స్థానిక సమస్యలపై అధికారులను నిలదీసేందుకు ఈ చట్టం ఎంతో ఉపయోగకరం. పదిమందికీ ఉపయోగపడే సమాచారాన్నే రాబడుతున్నాం.

- గుత్తల త్రిమూర్తి

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

అనుష్కలా పేరు తెచ్చుకుంటా!

ోడలింగ్‌లో రాణిస్తూ... వ్యాపార ప్రకటనల్లో మెరుస్తూ సినిమా పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తుంటారు కొందరు భామలు. అలా కథానాయికలుగా అవకాశాల్ని అందుకొన్నవాళ్లు చాలా...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net