కేసులు తగ్గుతున్నా ఆగని మృత్యుఘోష
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసులు తగ్గుతున్నా ఆగని మృత్యుఘోష

ఒక్క రోజులో కరోనాతో 4077 మంది మృతి
వరసగా మూడో రోజూ కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువ

ఈనాడు, దిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు తగ్గాయి. మరణాలు పెరిగాయి. 3,11,170 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 22 తర్వాత ఇంత కనిష్ఠ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. అయితే ఇవి తగ్గిన స్థాయిలో మరణాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. గత 24 గంటల్లో 4,077 మంది చనిపోయారు. ముందురోజు కంటే 4.57% కేసులు తగ్గినప్పటికీ.. 4.88% అధికంగా మరణాలు నమోదయ్యాయి. 4వేలకుపైగా మరణాలు సంభవించడం ఈ నెలలో ఇది ఆరోసారి. ఇదే సమయంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా కొత్త కేసుల కంటే ఎక్కువమంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. దీనివల్ల క్రియాశీలక కేసులు 55,344 మేర తగ్గాయి. ఇలా తగ్గడం వరుసగా ఇది మూడో రోజు. గత ఆరు రోజుల్లో ఇది అయిదోసారి.  పాజిటివిటీ రేటు కూడా 16.97%కి తగ్గింది. ఇంత తక్కువ నమోదు కావడం ఏప్రిల్‌ 21 తర్వాత ఇదే తొలిసారి. ఈ నెల 9న గరిష్ఠ సంఖ్యలో 4.03 లక్షల కేసులు నమోదైన తర్వాత కేసులు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈ గణాంకాలు దేశంలో కరోనా ‘పతాక స్థాయి’ (పీక్‌)ని దాటిపోయిందన్న సంకేతాన్నిస్తున్నాయి.
మహారాష్ట్రలో 960 మంది కన్నుమూత
మహారాష్ట్రలో ఒక్కరోజులో 960 మంది చనిపోయారు. ఏప్రిల్‌ 28 తర్వాత నమోదైన భారీ మరణాలు ఇవే. తమిళనాడులోనూ ప్రాణనష్టం పెరిగింది. దిల్లీలో కేసులు తగ్గినప్పటికీ 337 మంది ప్రాణాలు వదిలారు. వీటన్నింటి ప్రభావం దేశవ్యాప్త గణాంకాలపై పడి మొత్తం మరణాలు ఒక్కరోజులో 4,077కి చేరాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని