Indian Railways: నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్‌ రైలు!

విధుల్లో ఉన్న స్టేషన్‌ మాస్టర్‌ నిద్రపోవడంతో ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలు అరగంటపాటు నిలిచిపోయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Published : 05 May 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విధుల్లో ఉన్న స్టేషన్‌ మాస్టర్‌ నిద్రలోకి జారుకోవడంతో.. సిగ్నల్‌ లేక ఓ ఎక్స్‌ప్రెస్‌ రైలు దాదాపు అరగంటపాటు నిలిచిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటావా సమీపంలోని ఉడిమోర్‌ జంక్షన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం.. పట్నా- కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ రైలు (Patna-Kota Express) మే 3న ఉడిమోర్‌ జంక్షన్‌కు చేరుకుంది. అయితే.. అప్పటికే అక్కడున్న స్టేషన్‌ మాస్టర్‌ నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు గ్రీన్‌ సిగ్నల్‌ లేకపోవడంతో రైలును లోకోపైలట్‌ అక్కడే నిలిపేశాడు. స్టేషన్ మాస్టర్‌ను మేల్కొలిపేందుకు అనేక సార్లు హారన్ కొట్టినట్లు సమాచారం.

దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్‌ దౌత్యవేత్త..!

అప్పటికే రైలు అక్కడ దాదాపు అరగంటపాటు నిలిచిపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా డివిజన్ రైల్వే అధికారులు.. స్టేషన్ మాస్టర్‌నుంచి వివరణ కోరారు. అనంతరం తగు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌వో ప్రశస్తి శ్రీవాస్తవ ఓ వార్తాసంస్థకు తెలిపారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తనతోపాటు డ్యూటీలో ఉన్న పాయింట్‌మెన్ ట్రాక్ తనిఖీకి వెళ్లడంతో.. తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నట్లు తెలిపాడని వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు