ఉద్యోగాల భర్తీకి 4 నోటిఫికేషన్ల విడుదల

ప్రధానాంశాలు

ఉద్యోగాల భర్తీకి 4 నోటిఫికేషన్ల విడుదల

మొత్తం 71 పోస్టులు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 4 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లను మంగళవారం జారీచేసింది. 39 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి వచ్చేనెల 11 నుంచి నవంబరు 2 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. 24 లెక్చరర్స్‌/అసిస్టెంట్‌ హోమియో ప్రొఫెసర్‌, 3 లెక్చరర్స్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను అక్టోబరు 7 నుంచి 28వ తేదీ మధ్య పంపుకోవాలని పేర్కొంది. అలాగే..5 తెలుగు రిపోర్టర్ల పోస్టుల భర్తీకి అక్టోబరు 18 నుంచి నవంబరు 8 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉన్నట్లు తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని