వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం

ప్రధానాంశాలు

వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం

ఈనాడు, అమరావతి: దసరా ఉత్సవాల చివరిరోజు శుక్రవారం విజయవాడ దుర్గమ్మ రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉత్సవమూర్తులను పూజల అనంతరం హంసవాహనంపైకి తీసుకెళ్లారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నదీ విహారాన్ని నిర్వహించలేదు. నిలకడగానే హంసవాహనంపై వేడుక నిర్వహించి అనంతరం కృష్ణమ్మకు హారతులు సమర్పించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు తదితరులు తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజరాజేశ్వరీదేవి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని