logo

సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి

పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

Updated : 26 Apr 2024 06:38 IST

శివ్వంపేట, న్యూస్‌టుడే: పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. భర్తతో దూరంగా ఉంటున్న మహిళతో వరుడు దిగిన ఫొటోలను గతంలో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా వధువు బంధువులు చూశారు. దీంతో గురువారం వరుడి ఇంటికి వెళ్లి గొడవ చేశారు. గ్రామ పెద్దలతో పంచాయితీ నిర్వహించి అతనితో పెళ్లి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సుమారు రూ.7లక్షల వరకు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు రాలేదని శివ్వంపేట పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని