నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం

ప్రధానాంశాలు

నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటాం

విజయసాయి లేఖపై ఆర్బీఐ స్పందన

ఈనాడు, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కంపెనీలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాయని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై ఆర్బీఐ స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ‘‘ఎంపీ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఇండ్‌-భారత్‌ థర్మల్‌ పవర్‌ లిమిటెడ్‌ అనుబంధ కంపెనీలు భారీగా ఆర్థిక మోసాలకు పాల్పడి, ప్రజాధనాన్ని స్వాహా చేశాయి. ఈ విషయమై విచారణలో సీబీఐ నిష్క్రియాత్మకత ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా ఉంది’ అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రికి గతంలో లేఖ రాశారు. దీనిపై ఆర్బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ స్పందిస్తూ విజయసాయిరెడ్డికి లేఖ పంపారు. ఆ లేఖ ప్రతిని వైకాపా కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసింది. అందులో.. ‘మీరు వివిధ అంశాలను లేఖలో ప్రస్తావించారు. అవి పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ఏవైనా నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని