సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతులు

ప్రధానాంశాలు

సొంత ఖర్చుతో రోడ్డు మరమ్మతులు

రూ.3 లక్షలు వెచ్చించిన జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట గ్రామీణం, న్యూస్‌టుడే: గుంతలమయంగా మారిన రహదారికి తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలోని రామవరం- ఇర్రిపాక రోడ్డు గుంతలతో అధ్వానంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఈ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినా ఎన్నికల అనంతరం నిలిపేశారు. ‘జగన్‌ పాలనలో అడుగడుగునా అవినీతి సంత.. రహదారిపై అడుగుకో గుంత’ నినాదంతో తెదేపా ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా రహదారులకు మరమ్మతులు చేపట్టే కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా రామవరం నుంచి ఇర్రిపాక వరకు సుమారు 8 కిలోమీటర్ల రోడ్డును రూ. 3 లక్షల సొంత ఖర్చుతో జ్యోతుల నెహ్రూ శని, ఆదివారాల్లో మరమ్మతులు చేయించారు. ఆ మార్గంలో గుంతలను పూడ్చారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని