సినిమా

Facebook Share Twitter Share Comments Telegram Share
Kangana Ranuat: కత్రినా-విక్కీ పెళ్లి.. పొగుడుతూ పోస్ట్‌ చేసిన కంగన

ముంబయి: బాలీవుడ్‌ నటీనటులు కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. రాజ్‌స్థాన్‌లోని సిక్స్‌ సెన్సెన్స్ ఫోర్ట్‌లో వీరి వివాహ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. వీరి వివాహంపై తాజాగా నటి కంగనా రనౌత్‌ స్పందించారు. ఈ జంటపై పరోక్షంగా పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘సమాజంలో ఎంతోమంది ధనవంతులైన పురుషులు తమకంటే వయసులో చిన్నవారినే పెళ్లి చేసుకుంటారు.. భర్త కంటే భార్యకు పేరు, పలుకుబడి ఎక్కువగా ఉంటే ఆ వివాహబంధంలో కలతలు వస్తాయి.. ఇలాంటి ఎన్నో నిబంధనలు గురించి వింటూ నేను పెరిగాను. ఇప్పుడు.. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సక్సెస్‌, ధనవంతులైన నటీమణులు ఆ నిబంధనలకు స్వస్తి పలుకుతూ వివాహబంధంలోకి అడుగుపెట్టడం నాకెంతో ఆనందంగా ఉంది’’ అని కంగన తెలిపారు.

ఇక, విక్కీ-కౌశల్‌ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్‌లో జరిగిన పలు పార్టీల్లో ఈ జంట ప్రత్యేకార్షణగా నిలిచింది. వీరి పెళ్లి వార్తతో బీటౌన్‌లో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సెలబ్రిటీలందరూ రాజ్‌స్థాన్‌కి పయనమవుతున్నారు. ఇక వయసు పరంగా చూసుకుంటే కత్రినా కంటే విక్కీ ఐదేళ్లు చిన్నవాడు.


మరిన్ని

దేవ‌తార్చ‌న

+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.