డిసెంబరుకు 15,600 పాయింట్లకు నిఫ్టీ

మరిన్ని దిద్దుబాటులకు అవకాశం

బోఫా సెక్యూరిటీస్‌ అంచనా

ముంబయి: భారత స్టాక్‌ మార్కెట్లలో మదుపర్లు మరిన్ని నష్టాలు చవిచూసే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజీ సంస్థ బోఫా సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. డిసెంబరుకు మరో 10 శాతం దిద్దుబాటు రావొచ్చని, నిఫ్టీ 15,600 పాయింట్ల వద్ద ఏడాదిని ముగించొచ్చని వెల్లడించింది. జూన్‌లో నిఫ్టీ డిసెంబరు లక్ష్యం 14,500 పాయింట్లుగా అంచనా వేసిన సంస్థ.. తాజాగా లక్ష్యాన్ని పెంచడం గమనార్హం. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల రాకతో మార్కెట్లకు కొంత కొనుగోళ్ల మద్దతు లభించిందని బోఫా తెలిపింది. జులై కంటే ముందు 9 నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు 29 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ‘ప్రస్తుత ఒడుదొడుకుల పరిస్థితుల్లో మార్కెట్లపై అప్రమత్తంగా ఉన్నాం. అంతర్జాతీయ మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో నిఫ్టీ అంచనాలను తగ్గిస్తున్నాం’ అని బోఫా విశ్లేషకులు తెలిపారు. కంపెనీల ఆదాయాలు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయని, అయితే చమురు ధరలు, రూపాయి క్షీణత, దేశీయ ద్రవ్యోల్బణం వంటివి తగ్గడం సానుకూలాంశాలుగా పేర్కొంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని