పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు 11 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం

ఈనాడు, దిల్లీ: పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు 11 మంది అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆదివారం ఆమోదముద్ర వేశారు. గత నెల 25న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం 13 మంది న్యాయవాదులను ఆ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించడానికి సిఫార్సు చేయగా రాష్ట్రపతి అందులో 11 పేర్లకు ఆమోదం తెలిపారు. ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన మీదట రాష్ట్రపతి వీరి నియామకానికి పచ్చజెండా ఊపినట్లు కేంద్ర న్యాయశాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని