Adivi Sesh: బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. మీరెళ్లి చూడండి: అడివి శేష్‌

హైదరాబాద్‌: ‘బింబిసార’(Bimbisara), ‘సీతారామం’(Sitaramam) ప్రాజెక్ట్‌ల గురించి బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినడం ఆనందంగా ఉందని నటుడు అడివి శేష్‌ అన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా తాను ఐసోలేషన్‌లో ఉన్నానని.. థియేటర్లకు వెళ్లలేకపోతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘కల్యాణ్‌రామ్‌ నటించిన ‘బింబిసార’, నా స్నేహితులు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, సుమంత్‌ నటించిన ‘సీతారామం’ బాగున్నాయంటూ బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వినిపిస్తోంది. అసలు ఇది కదా కావాల్సింది..! కొవిడ్‌ వచ్చి ప్రస్తుతం నేను ఐసోలేషన్‌లో ఉన్నా. నాకోసం మార్నింగ్‌ షో ఒక సినిమా.. మ్యాట్నీలో మరో సినిమా కుమ్మేయండి’’ అని అడివి శేష్‌ పేర్కొన్నారు. అయితే, అడివి శేష్‌కు కరోనా వచ్చిందని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘గెట్‌ వెల్‌ సూన్‌ శేష్‌ అన్నా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల ‘మేజర్‌’తో మంచి విజయాన్ని అందుకున్న శేష్‌.. త్వరలోనే ‘హిట్‌-2’ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు.




మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని