వీఆర్‌ఎస్‌ దరఖాస్తులను ఆమోదించండి

క్షేత్రస్థాయి అధికారులకు తెలంగాణ ఆర్టీసీ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్‌) కోసం వచ్చిన దరఖాస్తుల ఆమోద ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ఆర్టీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బందిని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వీఆర్‌ఎస్‌ పథకాన్ని అమలు చేయాలని గడిచిన ఏడెనిమిది నెలలుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యాజమాన్యం గడిచిన నెల 31ని తుది గడువుగా ప్రకటించింది. సుమారు 2,500 ఉద్యోగులు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. అందిన దరఖాస్తులను ఆమోదించాల్సిందిగా క్షేత్రస్థాయి అధికారులను ఆదేశిస్తూ ఆర్టీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని