విదేశాల్లో ఘనంగా బతుకమ్మ పండగ

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో ఆదివారం తెలంగాణ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం, దసరా పండగ నిర్వహణ సంఘం ఆధ్వర్యంలో సిడ్నీలోని ది పాండ్స్‌ పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఆటపాటలతో ప్రాంగణం మార్మోగింది. ఉత్తమ బతుకమ్మలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఉత్సవాల కమిటీ ఛైర్మన్‌ అనిల్‌ మునగాల, కోశాధికారి శ్రీనివాస్‌రెడ్డి తోతుకుర్‌, ప్రజాసంబంధాల అధికారి డేవిడ్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.


దక్షిణాఫ్రికాలో...

బతుకమ్మ వేడుకలను దక్షిణాఫ్రికాలోని జోహానెస్‌బర్గ్‌లో తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో కనులపండువగా నిర్వహించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన తెలుగువారందరూ ఒక వద్దకు చేరి బతుకమ్మ ఆడారు. తెలంగాణ నుంచి వచ్చిన కళాకారుల బృందం ఆటపాటలతో అలరించింది. టాసా అధ్యక్షుడు యెలిగేటి వేణుమాధవ్‌, తాళ్లూరి శ్రీనివాస్‌, బండారు మురళి, బొబ్బాల శ్రీనివాస్‌రెడ్డి, రాపోలు సీతారామరాజు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి.


కెనడాలో...

కెనడాలోని హాలిఫాక్స్‌ నగరంలో మ్యారిటైం తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బెడ్ఫోర్డ్‌ హామండ్స్‌ ప్లేయిన్స్‌ కమ్యూనిటీ సెంటర్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 8 అడుగుల బతుకమ్మను పేర్చారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు.

 


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు