close

జాతీయ- అంతర్జాతీయ

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జాతీయ జెండాను అవమానిస్తే కఠిన చర్యలు

 చట్టానికి సవరణలు చేసిన చైనా

హాంకాంగ్‌: నిరుడు హాంకాంగ్‌లో జరిగిన నిరసనల సందర్భంగా ఆందోళన కారులు జాతీయ జెండాను అవమానించడాన్ని చైనా తీవ్రంగా తీసుకుంది. జాతీయ జెండా, చిహ్నాం పవిత్రతను దెబ్బతీసే వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు చైనా కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీ చట్టానికి సవరణలు చేసింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త చట్టం ప్రకారం.. చైనా జెండాను కాల్చినా, తొక్కినా.. నేరపూరిత చర్యగానే పరిగణిస్తారు. హాంకాంగ్‌, మకావూకి ఈ కొత్త చట్టం వర్తిస్తుంది. గత ఏడాది హాంకాంగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఆందోళన కారులు జెండాను తొక్కడంపై.. చైనాలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫలితంగానే కొత్త చట్టం రూపదాల్చింది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు