close

తాజా వార్తలు

ఆ సమస్య యూట్యూబ్‌ సీఈవోకూ తప్పలేదు!

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు స్మార్ట్‌ఫోన్లలో గంటల తరబడి యూట్యూబ్‌ వీడియోలు చూడటంతో పాటు వీడియో గేమ్స్‌తో హద్దులు దాటుతున్న సంగతి తెలిసిందే. ఇది నేడు ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. అయితే ఏకంగా యూట్యూబ్‌ సీఈవో సుసాన్‌ వోజ్‌సిక్కినూ ఈ సమస్యను వదల్లేదు. తన ఐదుగురు పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ అందకుండా చేస్తానని ఇటీవల ఆమె ఓ ముఖాముఖిలో వెల్లడించారు. ప్రత్యేకంగా కుటుంబమంతా విహారయాత్రలో ఉన్నప్పుడు, రాత్రి భోజనం చేసే సమయంలో తన పిల్లలందరి నుంచి స్మార్ట్‌ఫోన్లు తీసేసుకుంటానని చెప్పారు. దీనివల్ల వారు ఒకరితో మరొకరు మాట్లాడుకునే అవకాశం ఉంటుందని, తద్వారా బంధాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు పిల్లలు ఇతరులతో మాట్లాడేలా చూడాలని, ఎదుటి వారు చెప్పేది సరిగా అర్థం చేసుకోగలగాలని ఆమె సూచించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం.. ఐదేళ్ల కన్నా చిన్న పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ రోజుకు గంట మించి ఇవ్వకూడదు. మితిమీరిన స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పిల్లల్లో భౌతిక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆటలకు దూరం కావడం వల్ల స్థూలకాయం ముప్పు పెరగడం, మెదడు పనితీరు దెబ్బ తినడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతాయి.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు