close

తాజా వార్తలు

బాలికలపై లైంగిక వేధింపులు:టీచర్లపై కేసు

ఆనందపురం: బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులను ఉపాధ్యాయులు లైంగికంగా వేధించినట్లు కేసు నమోదైంది. దీంతో ఉపాధ్యాయులు సుందరరావు, వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. సహచర ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏసీపీ త్రినాథ్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు