close

తెలంగాణ

టికెట్ల కేటాయింపులో కొప్పుల ప్రమేయం లేదు: కుంతియా

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: శాసనసభ, పార్లమెంటు ఎన్నికల టికెట్ల కేటాయింపులో ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజుకు ఎలాంటి ప్రమేయం లేదని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. టీపీసీసీ, సీఎల్పీ, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు, ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఆలోచన మేరకే టికెట్లు కేటాయించారన్నారు. కొంత మంది రాష్ట్ర సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు.. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని, రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్‌ లభించకుండా కొప్పుల రాజు అడ్డుకుంటున్నారని మీడియా ద్వారా చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సీనియర్‌ నాయకులు పార్టీలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులను పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాలని, మీడియాకు ఎక్కొద్దని కుంతియా సూచించారు.

ఉనికి కోసమే భాజపా విమర్శలు: మల్లు రవి
తెలంగాణలో ఉనికి కోసమే కాంగ్రెస్‌పై భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్కొన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ  కేంద్రంలో భాజపాకు తెరాస తోక పార్టీ అయితే, రాష్ట్రంలో తెరాసకు భాజపా తోక పార్టీగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు