close

క్రీడలు

క్లిష్టమైన టెక్నిక్‌.. చురుకైన బుర్ర

స్మిత్‌ గురించి సచిన్‌

ఇటీవల ముగిసిన యాషెస్‌ సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఆటే హైలైట్‌. పరుగుల వరద పారించిన 30 ఏళ్ల స్మిత్‌ ఏకంగా 774 పరుగులు సాధించాడు. అతడి జోరుకు అబ్బురపడని వాళ్లు లేరు. అంతటా అతడి సంప్రదాయ భిన్నమైన టెక్నిక్‌పైనే చర్చ. స్మిత్‌ అంతగా ఎలా విజయవంతమవుతున్నాడో చాలా మంది విశదీకరించడానికి ప్రయత్నించారు. బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ కూడా స్మిత్‌ టెక్నిక్‌పై తన ఆసక్తిని దాచుకోకుండా ఉండలేకపోయాడు. స్మిత్‌ బ్యాటింగ్‌ టెక్నిక్‌ గురించి అతడు ఏమన్నాడంటే..

‘‘తొలి టెస్టులో స్మిత్‌ను స్లిప్‌ వలయంలో ఔట్‌ చేయడానికి ప్రయత్నించారు. కానీ స్మిత్‌ అడ్డంగా అటు ఇటూ కదులుతూ తన లెగ్‌స్టంప్‌ను పూర్తిగా కనపడనిచ్చాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతులను వదిలేశాడు. ఇంగ్లాండ్‌ ఆటలు సాగనివ్వలేదు’’
‘‘లార్డ్స్‌ టెస్టులో అతడికి లెగ్‌ స్లిప్‌ను పెట్టాలని ఇంగ్లాండ్‌ నిర్ణయించింది. జోఫ్రా ఆర్చర్‌ బౌన్సర్లతో అతణ్ని ఇబ్బంది పెట్టాడు. బంతి లైన్లోకి వెళ్లి.. కాస్త బ్యాక్‌ఫుట్‌పై ఆడడం స్మిత్‌ ఇబ్బంది పడడానికి కారణం. ఆర్చర్‌ ఎప్పుడు షార్ట్‌ బాల్‌ వేసినా స్మిత్‌ పుల్‌ చేయడానికి ప్రయత్నించలేదు. డిఫెండ్‌ చేశాడు. ఇబ్బందికర భంగిమల్లో ఆడాడు. అందువల్లే అతడి తలకు బంతి తగిలింది. ఆ తర్వాత అతడు కచ్చితంగా తన టెక్నిక్‌పై మరింత దృష్టిపెట్టి ఉంటాడు. లెగ్‌ స్లిప్‌ ఉంటే లెగ్‌ స్టంప్‌ కనిపించేలా అడ్డంగా కదలడం ఆపేశాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో బౌలర్లు తనను లక్ష్యంగా చేసుకున్నారని అతడికి తెలుసు. అడ్డంగా వెళ్లి, కాస్త వెనక్కి వంగితే బంతిని కిందికి కొట్టడం చాలా కష్టం. బంతి గాల్లో లేస్తుంది. కాబట్టి అలా ముందుకెళితే బంతిని అణచలేం. కానీ వెనక కాలిని అడ్డంగా కదిపి, ఫ్రంట్‌ ఫుట్‌ను ఉన్న చోటే ఉంచితే బంతిని అణచొచ్చు’’

‘‘నాలుగో టెస్టు నుంచి స్మిత్‌ వెనక్కి వంగకుండా ముందుకు వంగుతూ బంతులను వదిలి పెట్టడం మొదలెట్టాడు. దాని వల్ల అతడి తల ముందుకెళ్తుంది. దాంతో ఆర్చర్‌ షార్ట్‌ బంతితో పరీక్షించినా స్మిత్‌ తన ముందు భుజాన్ని ముందుకు జారవిడిస్తూ బంతిని వదిలేశాడు. అంతకుముందులా ఆడితే ఇబ్బందుల్లో పడేవాడు. స్మిత్‌ తెలివిగా టెక్నిక్‌లో సర్దుబాట్లు చేసుకున్నాడు’’

‘‘లెగ్‌ స్లిప్‌ పెట్టిన ప్రతిసారీ స్మిత్‌ తన ఎడమ పాదాన్ని కదపడం ఆపేశాడు. ఆ విధంగా అతడు తన లెగ్‌ స్టంప్‌ను కాపాడుకున్నాడు. అంతకుముందు అతడు అలా చేయలేదు. దీని వల్లే అతడిది సంక్లిష్టమైన టెక్నిక్‌, సువ్యవస్థిత ఆలోచన సరళి అంటా’’


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు