close

క్రీడలు

హైదరాబాద్‌కు మరో విజయం

బెంగళూరు: విజయ్‌ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్‌ మరో విజయం సాధించింది. సోమవారం 5 వికెట్ల తేడాతో గోవాను ఓడించింది. మొదట గోవా.. సిరాజ్‌ (4/20), సందీప్‌ (4/13)ల ధాటికి 37.4 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. తన్మయ్‌ అగర్వాల్‌ (66 నాటౌట్‌) రాణించడంతో లక్ష్యాన్ని హైదరాబాద్‌ 22.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టోర్నీలో మూడో విజయం సాధించిన హైదరాబాద్‌ గ్రూపులో 14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు