close

వసుంధర

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
మెలితిప్పితే అదరహో

ఆకట్టుకునేలా జడ వేసుకుంటే... ఆ అందమే వేరు. అలాగని మూడుపాయలు తీసుకుని అల్లడం, జుట్టు వదిలేయడం కాదు. చేసుకునే చిన్న ప్రయత్నమే ఎంతో మార్పు తెస్తుంది. అలాంటిదే ఇది. ముందుగా జుట్టుని చిక్కుల్లేకుండా దువ్వుకోవాలి. అపై కుడి, ఎడమల నుంచి రెండు పాయలు మధ్యకు తెచ్చి రబ్బరు బ్యాండు పెట్టుకోవాలి. ఈ రెండు పాయల నుంచి మరో రెండు పాయలు తీసుకుని ఒక్కోదాని మీదుగా ఇవతలకి తీసి అటూ ఇటూ, మధ్యలో మిగిలిన పాయల్ని కలిపి రబ్బరు బ్యాండు పెట్టుకోవాలి. చూడ్డానికి జడలో హృదయం విచ్చుకున్నట్లే ఉంటుంది.


మరిన్ని