close

తాజా వార్తలు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వాయిదా

దిల్లీ: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వాయిదా పడింది. మే 19న జరగాల్సిన ఈ పరీక్షను మే 27న నిర్వహించనున్నట్టు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆర్గనైజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఐఐటీ రూర్కీ వెల్లడించింది.  లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ పరీక్ష తేదీలో మార్పు చేసినట్టు స్పష్టంచేసింది. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను మే 19న నిర్వహించనున్నట్లు గతంలోనే  ప్రకటన వెలువడినప్పటికీ అదే రోజున లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్‌ జరగనుండటంతో ఈ పరీక్షను వాయిదా వేశారు. 8 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 19న పోలింగ్‌ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఈ పరీక్ష తేదీని మార్చినట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వాహకులు తెలిపారు. మే 27 సోమవారం పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష జరగనుంది.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు