close

ఆంధ్రప్రదేశ్

రాములోరి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

ఒంటిమిట్ట కోదండరామాలయంలో ఏర్పాట్లు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ చేయనున్నారు. ఈనెల 12 నుంచి 22వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. శుక్రవారం ఉదయం 3 గంటలకు సుప్రభాతం, 3.30 నుంచి 4 గంటల వరకు ఆలయశుద్ధి, 4 నుంచి 6 గంటల వరకు మూలవర్లకు వ్యాసాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 6నుంచి 7 గంటల దాకా అలంకరణ, ఆరాధన, అర్చన, 7 నుంచి 7.30 గంటల వరకు తొలి నైవేద్యం గంట, 7.30 నంచి 11 గంటల దాకా సర్వదర్శనం కోసం భక్తులకు అనుమతిస్తారు. 11 నుంచి 11.30 గంటలకు ఆలయ శుద్ధి, రెండో గంట ఉంటుంది. సాయంత్రం 6నుంచి 6.30 గంటల వరకు ఆలయ శుద్ధి, మూడో గంటకు నైవేద్యం సమర్పిస్తారు. సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, పట్టువస్త్రాలతో అలంకరిస్తారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు