బ్రేకింగ్

breaking

U19W ప్రపంచకప్‌: ఫైనల్‌లో మన అమ్మాయిలు!

[16:18]

పాచెఫ్‌స్ట్రామ్‌: అండర్‌ 19 మహిళల ప్రపంచకప్‌లో భారత అమ్మాయిలు ఫైనల్‌కు చేరారు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఘన విజయం సాధించారు. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ టీమ్‌ ఇండియా 14.2 ఓవర్లలోనే 110 పరుగులు చేసి విజయం సాధించింది. భారత జట్టులో శ్వేతా సెహ్రావత్‌ (61) అర్ధ సెంచరీతో రాణించారు.  తొలుత బౌలింగ్‌ చేసినప్పుడు ప్రషవి చోప్రా 3 వికెట్లు తీయగా, టిటాస్‌ సాధు, మన్నత్‌ కశ్యప్‌, షెఫాలీ వర్మ, అర్చనా దేవి తలో వికెట్‌ తీశారు. ఫైనల్‌ మ్యాచ్‌ జనవరి 29న జరుగుతుంది. సాయంత్రం జరిగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్‌లో గెలిచిన వారితో భారత్‌ ఫైనల్‌లో తలపడుతుంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని