బ్రేకింగ్

breaking

‘బొలెరో’ను ఢీకొట్టిన ‘దురంతో’.. 5 గంటలుగా నిలిచిన రైలు

[08:29]

భీమడోలు: ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. రైలు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో సుమారు 5 గంటలుగా రైలు నిలిచిపోయింది. రైలు ఢీకొనడంతో ఆ వాహనం ధ్వంసమైంది. బొలెరో వాహనంలో వచ్చినవాళ్లు దొంగలా? పారిపోయే క్రమంలో గేటును ఢీకొట్టారా? లేదా మరేదైనా కారణమా? అనే కోణంలో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని

తాజా వార్తలు