అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న రాబ‌డి పెరిగితే మీకు లాభ‌మా? - Additional income from Atal Pension Yojana
close

Published : 25/12/2020 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న రాబ‌డి పెరిగితే మీకు లాభ‌మా?

మీ పెట్టుబ‌డులు రాబడి కంటే ఎక్కువ సంపాదిస్తే అటల్ పెన్షన్ యోజన నుంచి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై) ప్ర‌భుత్వ క‌నీస పెన్ష‌న్ హామీ ప‌థ‌కం, ముఖ్యంగా అసంఘ‌టిత రంగాల్లో ప‌నిచేసేవారికి ఇత‌ర పెన్ష‌న్ ప‌థ‌కాల కంటే దీంతో ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంది. గ‌త సంవ‌త్స‌రం ఈ ప‌థ‌కంలో 11 శాతానికి పైగా రాబ‌డి ల‌భించింది. ఎల్ఐసీ పెన్ష‌న్ ఫండ్ 10.94 శాతం, ఎస్‌బీఐ పెన్ష‌న్ ఫండ్ 11.24 శాతం, యూటీఐ రిటైర్‌మెంట్ సొల్యూష‌న్స్ 11.01 శాతం రాబ‌డిని న‌మోదుచేశాయి. రాబ‌డి పెరిగితే మ‌రి చందాదారుడు ఎక్కువ పింఛ‌ను పొందుతాడా? తెలుసుకుందాం…

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ద్వారా 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు దాటిన‌వారు రూ.1000 నుంచి రూ.5000 వ‌ర‌కు పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు . అయితే ఆ ప‌థ‌కంపై ఎక్కువ రాబ‌డి వ‌స్తే అద‌‌న‌పు ప్ర‌యోజ‌నం కింద మ‌రింత ఎక్కువ‌గా పొందే అవ‌కాశం ఉంది. ఈ ఖాతాలో మీరు జ‌మ‌చేసిన మొత్తంపై వాస్తవ రాబడి కంటే ఎక్కువగా వ‌డ్డీ ల‌భిస్తే, అటువంటి అదనపు మొత్తం చందాదారుల ఖాతాకు జమ అవుతుంది. దీని ఫలితంగా చందాదారులకు మ‌రింత‌ మెరుగైన ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. అయితే పెన్షన్ విరాళాలపై వాస్తవంగా గ్రహించిన రాబడి కనీస హామీ కంటే తక్కువగా ఉంటే, అటువంటి ఆ కొరతను స‌మ‌తుల్యం చేసేందుకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది.

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప్రారంభ‌మై ఐదేళ్లు పూర్త‌యింది. ఈ ఏడాది మే నాటికి ఈ ప‌థ‌కంలో 2 కోట్ల‌కు పైగా చందాదారులు ఉన్నారు. ఈ ప‌థ‌కాన్ని 2015 లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ వ‌యో వృద్ధుల కోసం , ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో ప‌నిచేసేవారికోసం ప్రారంభించారు. 60 ఏళ్ల త‌ర్వాత క‌చ్చిత‌మైన హామీతో పెన్ష‌న్ ఇవ్వాల‌నేది దీని ల‌క్ష్యం. 18 సంవ‌త్స‌రాల నుంచి 40 ఏళ్ల వ‌య‌సువారు ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు. ఒక‌వేళ చందాదారుడు మ‌ర‌ణిస్తే వారి భార్య లేదా భ‌ర్త‌కు అంద‌జేస్తారు. ఇద్ద‌రూ మ‌ర‌ణిస్తే నామినీకి ఈ పెన్ష‌న్ మొత్తాన్ని అందిస్తారు.

జూన్ వ‌ర‌కు పీఎఫ్ఆర్‌డీఏ క‌రోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఖాతాలోకి ఆటో-డెబిట్ స‌దుపాయాన్ని జూన్ వ‌ర‌కు పీఎఫ్ఆర్‌డీఏ నిలిపివేసింది. అయితే జులై 1 నుంచి ఆటో-డెబిట్ స‌దుపాయం తిరిగి ప్రారంభ‌మైంది. ఏప్రిల్ నుంచి ఆగ‌స్ట్ 2020 వ‌ర‌కు చెల్లించాల్సిన‌వి ఏవైనా పెండింగ్ ఉంటే సెప్టెంబ‌ర్ 30 లోగా చెల్లిస్తే ఎలాంటి జ‌రిమానా ఉండ‌దు. ‌


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని