close
Array ( ) 1

తాజా వార్తలు

ఐపీవోకు బార్బెక్యూ నేషన్‌

న్యూదిల్లీ: ఆతిథ్య రంగానికి చెందిన బార్బెక్యూ నేషన్‌ సంస్థ ఐపీవోకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొంది. ఈ మేరకు సెబీకి పత్రాలను సమర్పించింది. రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్లను సమీకరించేందు ఐపీవోకు రానుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 98,22,947 షేర్లను విక్రయించనుంది. ఈ విషయాన్ని సెబీకి అందజేసిన పత్రాల్లో పేర్కొంది. మరో రూ.150 కోట్లను ప్రీ ఐపీవో ప్లేస్‌మెంట్‌లో కేటాయించనున్నారు. 
ఈ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తంతో రూ.205 కోట్ల రుణభారాన్ని తగ్గించుకోనుంది. ఈ కంపెనీలో ప్రమోటర్ల వాటా 60.24శాతంగా ఉంది. మిగిలిన దానిలో 33.28శాతం , రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన సంస్థకు 2.05శాతం వాటాలు ఉన్నాయి. ఈ సంస్థకు 2018లో ఐపీవోకు వచ్చేందుకు అనుమతులు వచ్చినా.. మళ్లీ వెనుకంజ వేసింది. అప్పట్లో మార్కెట్లో పరిస్థితులు బాగోలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ 138 బార్బెక్యూనేషన్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తోంది. వీటిల్లో ఏడు యూఏఈ, ఒమన్‌, మలేషియాల్లో ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.