ప్రభుత్వ ఆదాయంలో ‘పరోక్ష’ వృద్ధి - Central govts indirect tax collection up in FY21
close

Published : 13/04/2021 20:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభుత్వ ఆదాయంలో ‘పరోక్ష’ వృద్ధి

 జీఎస్టీలో తగ్గుదల

ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్ర ప్రభుత్వానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంలో 12శాతం వృద్ధి కనిపించింది. మొత్తం రూ.10.71 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. సవరించిన అంచనాల కంటే ఇది 8.2శాతం అధికం. గతేడాది ఇది రూ.9.54 లక్షల కోట్లు మాత్రమే ఉంది. ఇక వస్తుసేవల పన్ను ఆదాయంలో మాత్రం 8శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 

గత ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్‌ డ్యూటీ రూపంలో రూ.1.32 లక్షల కోట్లు లభించాయి. అంతకు ముందు సంవత్సరం లభించిన రూ.1.09 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 21శాతం అదనం. 

కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ, సేవాపన్ను బకాయిల రూపంలో మొత్తం రూ.3.91లక్షల కోట్ల ఆదాయం లభించింది. ఇది అంతకు ముందు ఏడాది లభించిన రూ.2.45 లక్షల కోట్లతో పోలిస్తే 59శాతం అదనం. 

 ఇక కేంద్ర జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ కలిపి రూ.5.48లక్షల కోట్ల  లభించాయి. అంతకుముందు ఏడాది రూ.5.99 లక్షల  కోట్లు లభించాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో జీఎస్టీ వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. కేవలం ద్వితీయార్థంలోనే మాత్రమే బాగా పుంజుకొన్నాయి. చివరి ఆరు నెలల్లో ప్రతినెలా దాదాపు లక్షకోట్ల రూపాయల ఆదాయాన్ని దాటేసింది. మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.24లక్షల కోట్లు దాటేసింది. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని