Nykaa: ఐపీఓకి ముందు నైకా కీలక కొనుగోలు..! - Nykaa acquires majority stake in Dot and Key
close

Updated : 22/10/2021 17:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nykaa: ఐపీఓకి ముందు నైకా కీలక కొనుగోలు..!

దిల్లీ: త్వరలో ఐపీఓకి రానున్న బ్యూటీ ఉత్పత్తుల ఈ-కామర్స్‌ సంస్థ నైకా.. ప్రముఖ స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ అయిన ‘డాట్‌ అండ్‌ కీ’లో మెజారిటీ వాటాలు సొంతం చేసుకుంది. ‘డైరెక్ట్‌ టు కన్జ్యూమర్‌’ సెగ్మెంట్‌లో నైకా ఓ సంస్థను కొనుగోలు చేయడం ఇదే తొలిసారి. దీంతో నైకా సంస్థ సొంత ఉత్పత్తుల జాబితాలో మరో బ్రాండ్‌ చేరనుంది. అయితే, ఈ ఆర్థిక లావాదేవీ విలువను నైకా బయటకు వెల్లడించలేదు. కానీ, ‘డాట్‌ అండ్‌ కీ’లో 3,35,000 ఈక్విటీ షేర్లను అంటే 51 శాతం వాటాను రూ.46.9 కోట్లకు కొనుగోలు చేసినట్లు నైకా ఐపీఓ కోసం సెబీకి సమర్పించిన ప్రాథమిక పత్రాల్లో పేర్కొంది. మరో 3,57,143 ఈక్విటీ షేర్లను రూ.50 కోట్లకు సబ్‌స్కైబ్‌ చేసుకున్నట్లు తెలిపింది. మిగిలిన 49 శాతం వాటాలను తర్వాతి దశలో 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.153 కోట్లకు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. సంస్థ పనితీరు, అప్పటి విలువను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని