సెన్సెక్స్ -530‌.. నిఫ్టీ -133 - Sensex down over 500 pts
close

Updated : 25/01/2021 15:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెన్సెక్స్ -530‌.. నిఫ్టీ -133

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఒడుదొడులకు లోనయ్యాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వంటి పరిణామాలతో వరుసగా మూడో రోజూ భారీ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు భారీగా కుంగాయి. దీంతో సెన్సెక్స్‌ 500 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 14,250 దిగువకు చేరింది. కేంద్ర బడ్జెట్‌ వరకు మార్కెట్లకు ఒడుదొడుకులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ కాసేపటి తర్వాత నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. చివరికి 530.95 పాయింట్ల నష్టంతో 48,347.59 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 133 నష్టంతో 14,238.90 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.94గా ఉంది. నిఫ్టీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌, ఐషర్‌ మోటార్స్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌, సిప్లా, హీరో మోటోకార్ప్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ షేర్లు లాభాలు చవిచూశాయి. మెటల్‌, ఫార్మా మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించిన ఫలితాల్లో పెట్రోరసాయనాల (ఓ2సీ) విభాగం ఆదాయం 30 శాతం మేర పడిపోయిన నేపథ్యంలో ఆర్‌ఐఎల్‌ షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా పడ్డాయి.

ఇవీ చదవండి..
ప్రపంచమంతా ఓవైపు.. భారత్‌, చైనా మరోవైపు
ఎస్‌బీఐ.. పోస్టాఫీస్.. రిక‌రింగ్‌ డిపాజిట్‌.. ఏది మేలు?


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని