మార్కెట్లకు నేడు నష్టాలే.. - Sensex sheds 379 pts Nifty ends below 15200
close

Updated : 18/02/2021 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లకు నేడు నష్టాలే..

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, దిగ్గజ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడితో వరుసగా మూడో రోజు దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 379 పాయింట్లు దిగజారగా.. నిఫ్టీ 15,200 కిందకు పడిపోయింది. 

ఈ ఉదయం సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.. ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు.. అంతకంతకూ పతనమయ్యాయి. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 379.14 పాయింట్లు కోల్పోయి 51,324.69 వద్ద, నిఫ్టీ 89.95 పాయింట్ల నష్టంతో 15,118.95 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, శ్రీ సిమెంట్‌ షేర్లు భారీగా నష్టపోగా.. ఓఎన్‌జీసీ, భారత్‌ పెట్రోలియం, గెయిల్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.

ఇవీ చదవండి..

ఎల్‌ఐసీ ఐపీవోకు మార్గం సుగమం

ఈ టైంలో ప్రైవేటీకరణా..?అదో ప్రమాదకర ఆలోచన!


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని