రెండో రోజూ లాభాల్లోనే... - Stock market closing bell
close

Updated : 02/03/2021 15:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో రోజూ లాభాల్లోనే...

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ఆసియా సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల బాట పట్టినప్పటికీ.. దేశీయ సూచీలు మాత్రం లాభాల్లో ముగియడం గమనార్హం. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడం మదుపర్లలో విశ్వాసం నింపింది. ఓ దశలో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో డీలాపడ్డ సూచీలు తిరిగి పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకాయి. ఉదయం 50,258 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 50,439 వద్ద గరిష్ఠాన్ని.. 49,807 వద్ద కనిష్ఠాన్ని తాకింది.

ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఉదయం 14,865 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించింది. రోజులో 14,957 -14,760 మధ్య కదలాడింది. చివరకు సెన్సెక్స్‌ 447 పాయింట్ల లాభంతో 50,296 వద్ద ముగియగా.. నిఫ్టీ 157 పాయింట్లు ఎగబాకి 14,919 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.38 వద్ద నిలిచింది. టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌ వంటి ప్రముఖ కంపెనీల షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి.

సెన్సెక్స్‌ టాప్‌ 30లో ఐదు కంపెనీలు మినహా మిగిలిన సంస్థల షేర్లన్నీ లాభాలను ఒడిసిపట్టాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడడం విశేషం. టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, అదానీ పోర్ట్స్‌, విప్రో లిమిటెడ్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్ని చవిచూశాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని