Stock market: ఊగిసలాటలో సూచీలు - Stock markets are in Volatile mode
close

Updated : 26/07/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: ఊగిసలాటలో సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఊగిసలాటలో పయనిస్తున్నాయి. తొలుత నస్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి చేరి తిరిగి నష్టాల్లోకి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. అమెరికా సూచీలు శుక్రవారం లాభాలతో ముగియగా.. నేడు ఆసియా-పసిఫిక్‌ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:34 గంటల సమయంలో సెన్సెక్స్‌ 42 పాయింట్ల నష్టంతో 52,932 వద్ద.. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 15,845 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.48 వద్ద ట్రేడవుతోంది.

బీఎస్‌ఈ 30 సూచీలో ఐటీసీ, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, టైటన్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా..ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, మారుతీ, ఏషియన్ పెయింట్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని