Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు - Stock markets opened in green
close

Published : 27/10/2021 09:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Stock market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్‌ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఐరోపా మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. నేడు ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:23 గంటల సమయంలో సెన్సెక్స్‌ 172 పాయింట్ల లాభంతో 61,523 వద్ద.. నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 18,318 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.02 వద్ద కొనసాగుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో.. ఏషియన్ పెయింట్స్‌, సన్‌ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్అండ్‌టీ, టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, నెస్లే ఇండియా, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని