2.85 లక్షల కార్లు వెనక్కి పిలిపించిన టెస్లా - Tesla recalls 2.85 lakh cars
close

Updated : 28/06/2021 07:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2.85 లక్షల కార్లు వెనక్కి పిలిపించిన టెస్లా

బీజింగ్‌: టెస్లా సంస్థ చైనాలో 2,85,000 విద్యుత్తు వాహనాలను వెనక్కి పిలిపించింది. క్రూయిజ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఒక్కసారిగా యాక్టివేట్‌ అయ్యి, ఒక్కసారిగా వేగం పెరిగే ప్రమాదం ఉన్నందునే, సరిచేసేందుకు వీటిని పిలిపిస్తున్నట్లు తెలిపింది. ఇందులో  35,665 కార్లు మాత్రమే విదేశాల నుంచి దిగుమతి చేసుకోగా, మిగిలినవన్నీ చైనాలో తయారైనవే. 2019 డిసెంబరు నుంచి 2021 జూన్‌ మధ్య తయారైన మోడళ్లే ఇవన్నీ. కార్ల యజమానులు కంపెనీ విక్రయశాలకు తమ కారును తీసుకెళ్తే, క్రూయిజ్‌ కంట్రోల్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తామని టెస్లా తెలిపింది.


ఎయిరిండియా తరవాత మరిన్ని ప్రభుత్వ సంస్థలపై దృష్టి

కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ ప్రణాళిక

దిల్లీ: వెనకటి తేదీ నుంచి పన్ను విధింపు (రెట్రోస్పెక్టివ్‌ పన్నులు) కేసులో బ్రిటన్‌కు చెందిన కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో గెలిచిన తరవాత, సొమ్ము రికవరీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అమెరికా నుంచి సింగపూర్‌ వరకు వివిధ దేశాల్లో ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది. భారత ప్రభుత్వం చెల్లించాల్సిన 1.2 బిలియన్‌ డాలర్లు, వడ్డీ, అపరాధ రుసుముల కోసం ఆయా దేశాల్లో వ్యాజ్యాలు దాఖలు చేస్తామని కంపెనీ న్యాయవాది వెల్లడించారు. గత నెలలో అమెరికాలోని కోర్టులో ఎయిరిండియాపై కెయిర్న్‌ ఎనర్జీ దావా దాఖలు చేసింది. దీనికి సమాధానం ఇచ్చేందుకు ఎయిరిండియాకు జులై వరకు అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, ఫ్రాన్స్‌, కెనడా, సింగపూర్‌ తదితర దేశాల్లో భారత ప్రభుత్వ ఆస్తుల్ని గుర్తించిన కెయిర్న్‌ ఎనర్జీ పీఎల్‌సీ ఆయా దేశాల్లో దావాలు వేసేందుకు సిద్ధమవుతోంది.


 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని