ఉద్యోగులకు వ్యాక్సిన్‌.. కంపెనీలు రెడీ! - companies ready to buy vaccines for emplyees
close

Published : 18/01/2021 21:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్యోగులకు వ్యాక్సిన్‌.. కంపెనీలు రెడీ!

దిల్లీ: కరోనాను తరిమికొట్టేందుకు ఉద్దేశించిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశంలో ప్రారంభమైంది. తొలి విడతగా 3 కోట్ల ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు టీకా అందించే కార్యక్రమం మొదలైంది. ఇదే సమయంలో తమ ఉద్యోగులకు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందించేందుకు పలు కంపెనీలు సిద్ధమయ్యాయి. వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రాధాన్య వ్యక్తులకు ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత బహిరంగమార్కెట్లోకి వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీలు భావిస్తున్నాయి. అవి అందుబాటులోకి రాగానే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ఉద్యోగులకు అందించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగులకు వ్యాక్సిన్‌ అందించేందుకు ఐటీసీ కంపెనీ సిద్ధంగా ఉందని, ఇప్పటికే వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలతో చర్చలు ప్రారంభించామని ఆ కంపెనీ మానవ వనరుల విభాగాధిపతి ఒకరు వివరించారు. వ్యాక్సిన్లు కమర్షియల్‌గా వాడుకలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు వ్యాక్సిన్‌ అందిస్తామని టాటా స్టీల్‌ తెలిపింది. బల్క్‌గా వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సైతం వ్యాక్సిన్‌ కొనుగోలుకు సుముఖత వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి..
భారత్‌కు టెస్లా.. వయా నెదర్లాండ్స్‌ ..!
ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవ‌లు 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని