close

Published : 28/02/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వినియోగదారులకు ఆటమ్‌ విద్యుత్‌ బైకులు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ బైకులను ఉత్పత్తి చేస్తున్న హైదరాబాద్‌ అంకురం ఆటుమొబైల్‌ తన బైకు ‘ఆటమ్‌ 1.0’ డెలివరీలను ప్రారంభించింది. శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ గడ్డం వంశీ కృష్ణ తొలి 10 మంది వినియోగదారులకు వీటిని అందించారు. వివిధ ప్రదేశాలకు విరివిగా పర్యటించే భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీటిని తీసుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. రెట్రో వింటేజ్‌ డిజైన్‌తో వచ్చిన ఆటమ్‌ 1.0 ధర రూ.50,000. ఇప్పటికే ఈ వాహనానికి పలు నగరాల నుంచి 400లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. 4 గంటల్లో ఛార్జింగ్‌ పూర్తి చేసుకొని, 100 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. తెలంగాణలో ఏర్పాటు చేసిన ప్లాంటుకు ఏడాదికి 15,000 బైకులను ఉత్పత్తి సామర్థ్యం ఉంది.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని