అల్కాటెల్‌ లూసెంట్‌కు భవిష్యత్‌తరం సేల్స్‌ ప్లాట్‌ఫాం: టీసీఎస్‌
close

Published : 13/06/2021 02:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్కాటెల్‌ లూసెంట్‌కు భవిష్యత్‌తరం సేల్స్‌ ప్లాట్‌ఫాం: టీసీఎస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫ్రాన్స్‌కు చెందిన టెలిఫోన్‌ పరికరాల అగ్రశ్రేణి తయారీ సంస్ధ అల్కాటెల్‌ లూసెంట్‌కు భవిష్యత్‌తరం సేల్స్‌ ప్లాట్‌ఫామ్‌ అందిస్తున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రకటించింది. ఈ సంస్థ పరికరాలు సురక్షితమైనందున ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఈ సంస్థకు ఆర్డర్లు ఇ మెయిల్‌, ఫ్యాక్స్‌ ద్వారా వినియోగదారులు పంపుతుంటే, మాన్యువల్‌గా అవుట్‌పుట్‌ తీసుకుని, తదుపరి చర్యలు తీసుకునేవారు. ఈ విధానంలో ఒక్కోసారి కొంత సమాచార లోపం చేటుచేసుకునేది. టీసీఎస్‌ రూపొందించిన రోబోటెక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ ప్లాట్‌ఫామ్‌ వద్ద సాఫ్ట్‌వేర్‌ రోబోస్‌ ఈ విధులను నిర్వహిస్తాయి. కంపెనీకి అందిన ఇ-మెయిల్‌, ఫ్యాక్స్‌ల నుంచి సమాచారం తీసుకుని, ఈఆర్‌పీని సిద్ధం చేస్తాయి. వినియోగదారుల అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా ఏయే పరికరాలు (కాన్ఫిగరేషన్‌) లభిస్తాయో వెల్లడిస్తుంది. సాధారణంగా వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని, సమాచారాన్ని ఇచ్చేందుకు వ్యాపారసంస్థలు నిర్వహించే ప్లాట్‌ఫామ్‌ను వ్యాపార సంస్థల మధ్య నెలకొల్పడం ఈ ప్లాట్‌ఫామ్‌ ప్రత్యేకతగా టీసీఎస్‌ టెక్నాలజీ బిజినెస్‌ గ్లోబల్‌ హెడ్‌ వి.రాజన్న తెలిపారు. వేగం, అధిక సామర్థ్యం, కచ్చితత్వం ద్వారా వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు ఈ ప్లాట్‌ఫామ్‌ దోహద పడుతుందన్నారు. తరచూ ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు ఆఫర్‌ ఇచ్చే రీతిలోనే వినియోగదారుల కొనుగోళ్లకు అనుగుణంగా ధరలనూ వేర్వేరుగా అందిస్తుందని వివరించారు.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని