ఐఫోన్‌ 13పై ఇన్‌గ్రామ్‌ మైక్రో ఆఫర్లు
close

Published : 17/09/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐఫోన్‌ 13పై ఇన్‌గ్రామ్‌ మైక్రో ఆఫర్లు

హైదరాబాద్‌: యాపిల్‌ ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లపై అధీకృత రిటైలర్‌ ఇన్‌గ్రామ్‌ మైక్రో రాయితీలు ప్రకటించింది. దేశీయంగా ఐఫోన్‌ 13 ముందస్తు బుకింగ్‌లు శుక్రవారం (ఈ నెల 17న) ప్రారంభం కానున్నాయి. రిటైల్‌ విక్రయాలు 24 నుంచి మొదలవుతాయి. తాజా ఉత్పత్తులపై ఆఫర్లు అందించడానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇతర భాగస్వాములతో ఇన్‌గ్రామ్‌ మైక్రో జట్టు కట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో ఈఎంఐ లావాదేవీలు లేదా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులతో సాధారణ కొనుగోళ్ల ద్వారా ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 మినీలను కొంటే రూ.6000 వరకు నగదు వాపసు ఇవ్వనున్నారు. ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌ మోడళ్ల కొనుగోలుపై రూ.5000 నగదువాపసు ప్రకటించారు. ఐఫోన్‌ 13ను రూ.3329 నెలవారీ కిస్తీతో, వడ్డీలేని సులభ వాయిదాల్లో విక్రయించనుంది.  ఎక్స్ఛేంజీ బోనస్‌ కింద రూ.3000 పొందొచ్చు. మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఇండియాస్టోర్‌ డాట్‌ కామ్‌ను సంప్రదించొచ్చని సంస్థ ప్రకటించింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని