హైదరాబాద్‌లో చేతక్‌
close

Published : 22/09/2021 03:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌లో చేతక్‌

ఇ-స్కూటర్‌ బుకింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: బజాజ్‌ ఆటో లిమిటెడ్‌, తన చేతక్‌ ఇ-స్కూటర్‌ను హైదరాబాద్‌లో విక్రయించేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ప్రారంభించింది. చేతక్‌.కామ్‌ అనే వెబ్‌సైట్లో రూ.2,000 చెల్లించి చేతక్‌ ఇ-స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చని బజాజ్‌ ఆటో వెల్లడించింది. ఇప్పటి వరకు ఇ-స్కూటర్‌ను పుణె, బెంగళూరు, నాగ్‌పుర్‌, మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్‌, చెన్నైలలో మాత్రమే విక్రయిస్తోంది. నాలుగు రంగుల్లో, మూడేళ్ల బ్యాటరీ వారెంటీతో చేతక్‌ ఇ-స్కూటర్‌ను అందిస్తున్నట్లు, ప్రారంభ ధర రూ.1.44 లక్షల నుంచి ఉన్నట్లు బజాజ్‌ ఆటో పేర్కొంది. టెస్ట్‌ రైడ్‌ కోసం ఆసక్తి గల వినియోగదార్లు బేగంపేట, కాచిగూడ, కూకట్‌పల్లిలోని చేతక్‌ ఇ-స్కూటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలను సందర్శించవచ్చని వివరించింది. ఇప్పటి వరకు జరిగిన బుకింగ్‌లకు అక్టోబరు నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం చేతక్‌ ఇ-స్కూటర్‌ బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. ఒకసారి ఛార్జింగుతో 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని