ఐరోపా అపరాధ రుసుంపై కోర్టుకెళ్లిన గూగుల్‌
close

Published : 28/09/2021 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐరోపా అపరాధ రుసుంపై కోర్టుకెళ్లిన గూగుల్‌

లండన్‌: ఐరోపా సమాఖ్య (ఈయూ) ఎగ్జిక్యూటివ్‌ కమిషన్‌ 2018లో కంపెనీపై విధించిన అపరాధ రుసుమును వ్యతిరేకిస్తూ యూరోపియన్‌ యూనియన్‌ కోర్టును గూగుల్‌ ఆశ్రయించింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కున్న ఆధిపత్యం ద్వారా పోటీ వాతావరణానికి గూగుల్‌ ఇబ్బంది తెచ్చిందన్న ఆరోపణలపై ఈయూ 4.34 బిలియన్‌ యూరోల (5 బి. డాలర్లు) అపరాధ రుసుమును గూగుల్‌కు విధించిన సంగతి తెలిసిందే. 2017 నుంచి 2019 మధ్య కమిషన్‌ గూగుల్‌పై మొత్తం మూడు అపరాధ రుసుము (8 బిలియన్‌ డాలర్లు)లను విధించింది. కోర్టు నిర్ణయం వచ్చే ఏడాదిలోపు అయితే వెలువడకపోవచ్చని తెలుస్తోంది.

మేం లీక్‌ చేయలేదు: సీసీఐ

గూగుల్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఒప్పందాలపై జరుగుతున్న దర్యాప్తు విషయంలో మీడియాకు ఎటువంటి సమాచారాన్ని తాము వెల్లడించలేదని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) సోమవారం దిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. గూగుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ నిలవలేదని చెబుతూ దానిని పక్కనపెట్టింది. గూగుల్‌కు ఇంకా  అభ్యంతరాలుంటే చట్టపరంగా ముందుకెళ్లవచ్చని కోర్టు తెలిపింది.


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని