Nominee: నామినీ పేరు రాశారా?
close

Updated : 27/08/2021 11:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nominee: నామినీ పేరు రాశారా?

బ్యాంకు ఖాతా.. పెట్టుబడులు.. పథకాలు.. జీవిత బీమా పాలసీలు.. ఈపీఎఫ్‌.. తదితరాలు ఏవైనా సరే.. అందులో నామినీ పేరు తప్పనిసరి. అయితే, చాలామంది ఈ విషయాన్ని అంతగా  పట్టించుకోరు. అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందీ రాదు కానీ..  పెట్టుబడిదారుడికి అనుకోనిదేదైనా  జరిగినప్పుడు.. కుటుంబ సభ్యులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికి  అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిజానికి నామినీ.. చట్టబద్ధమైన వారసులు వేర్వేరు. పెట్టుబడులు వారసులందరికీ చేరేందుకు.. నామినీ ఒక వారధి మాత్రమే. అంటే.. పెట్టుబడిదారుడికి ఏదైనా జరిగినప్పుడు అతని తరఫున వారసులకు వాటిని బదిలీ చేసే వ్యక్తి అన్నమాట. అందుకే నామినీగా సొంత వారినే కాదు.. బయట వారినీ నియమించుకునే అవకాశం ఉంది.


పెట్టుబడులకు అసలు యజమాని మరణించిన సందర్భంలో.. వాటిని అతని వారసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అందించేందుకు నామినీ తోడ్పడతారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్లు, డీమ్యాట్‌ ఖాతా, చిన్న మొత్తాల పొదుపు, బ్యాంకు ఖాతాలు, జీవిత బీమా పాలసీలు.. ఇలా ప్రతి చోటా నామినీ అవసరం ఉంటుంది.


ఒకవేళ ఒక ఖాతాదారుడు నామినీ పేరు రాయలేదనుకుందాం. ఆ ఖాతాదారుడికి ఏదైనా జరిగినప్పుడు బ్యాంకు సంబంధిత వ్యక్తి వారసుల కోసం చూస్తుంది. వారు వచ్చిన తర్వాత వారసత్వ ధ్రువీకరణను కోరుతుంది. లేదా వీలునామా అవసరమని చెప్పొచ్చు. ఇవన్నీ పూర్తయ్యేనాటికి ఎంతో సమయం పడుతుంది. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం బ్యాంకు ఖాతాల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము దాదాపు రూ.25,000 కోట్ల వరకూ ఉంది. ఈ మొత్తం అంతా నామినీ వివరాలు సరిగా లేకపోవడమే కారణం.


ఒక వ్యక్తి వీలునామా రాసినప్పుడు.. నామినీ.. ఆ మేరకు వారసులకు ఆస్తులను అందించాల్సి ఉంటుంది. అంతేకానీ, నామినీగా పేరు రాసినంత మాత్రాన మొత్తం అతనికి/ఆమెకే చెందదు. నామినీ పేరును ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.


బ్యాంకు ఖాతాలో ఒకరిని నామినీగా పేర్కొనవచ్చు. ఉమ్మడి ఖాతా ఉంటే.. ఒకరి కంటే ఎక్కువ నామినీలు ఉండవచ్చు. జీవిత బీమా పాలసీల్లో ఎంతమంది నామినీలనైనా పేర్కొనవచ్చు. పాలసీ విలువలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది వివరించాలి. ఈపీఎఫ్‌లోనూ ఇలాంటి వెసులుబాటు ఉంటుంది. డీమ్యాట్‌ ఖాతాలోనూ ఒకరికంటే ఎక్కువ నామినీలుగా ఉండేందుకు అవకాశం ఉంది.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని